బతుకుదెరువు కోసం ఎక్కడికో వలస వెళ్లి ఎన్నికల సమయంలో సొంతూరుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే వారు చాలామందే ఉంటారు. ఇది ఎంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇకపై ఈ బాధ ఉండదు. వలస వెళ్లిన వారు ఉన్నచోటు నుంచే స్వస్థలంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు త్వరలోనే ఆర్‌వీఎంలు అందుబాటులోకి రాబోతున్నాయి. అచ్చు గుద్దినట్లు ఈవిఎం ల లానే ఉండే వీటితో వలసదారులు వాళ్ళు ఉన్న ఊరి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.