బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఈడీ ఈరోజు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పోర్నోగ్రఫీ సినిమాల ప్రొడక్షన్లో భాగంగా అతడు చట్ట విరుద్ధంగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్లు ఈడీ వెల్లడించింది. 2019 ఫిబ్రవరిలో ఆర్మ్స్ ప్రైమ్ మీడియా లిమిటెడ్‌ను స్థాపించిన కుంద్రా.. అనంతరం హాట్‌షాట్స్ యాప్‌ను కూడా క్రియేట్ చేసి దానిని యుకె కంపెనీ కెన్రిన్కు అమ్మేశాడు. అయితే ఆ కంపెనీ రాజ్‌కుంద్రా బావ ప్రదీప్ బక్షీదేనని ఈడీ ఆరోపిస్తోంది.