రాహుల్​ కు గడువు పెంచిన ఈడీ

By udayam on June 3rd / 10:19 am IST

నేషనల్​ హెరాల్డ్​ కేస్​లో కాంగ్రెస్​ అగ్రనాయకుడు రాహుల్​ గాంధీకి ఈడీ ఇచ్చిన సమన్లలో కాస్త మార్పులు చేసింది. జూన్​ 13 లోపు ఆయన తమ ముందు విచారణకు రావాల్సి ఉంటుందని తాజాగా మార్పులు చేసింది. అంతకు ముందు ఇదే కేసులో సోనియా, రాహుల్​ గాంధీలు ఈనెల 8న తమ ముందు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. ఇప్పుడు ఆ తేదీని 13కు మార్పు చేసింది. సోనియా గాంధీ కొవిడ్​ 19 బారిన పడడంతో ఈడీ తన విచారణను వాయిదా వేసుకుంది.

ట్యాగ్స్​