చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలో ఈడీ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు సైతం నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంలో మంత్రి పిఎ హరీశ్ సైతం ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇంకోవైపు ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇంకోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.