క్యాసినో, మనీలాండరింగ్ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గత కొద్దీ రోజులుగా తెలంగాణలో ఈడీ, ఐటీ శాఖల అధికారులు తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇళ్ళు, ఆఫీసులను ఈడీ టార్గెట్ చేస్తోంది. రీసెంట్ గా మంత్రి కమలాకర్ తో పాటు టిఆర్ఎస్ ఎంపీ ఇళ్లలో , ఆఫీస్ లలో సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లు ఈడీ విచారణకు హాజరయ్యారు.