ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్‌లో చేర్చింది. నిందితుడు సమీర్‌ను ఈడీ విచారించి కీలక విషయాలను బయటపెట్టింది. సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉంది. ఒబెరాయ్ హోటల్‌లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్వహించిన సమావేశంలో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా పాల్గొన్నారని అందులో పేర్కొన్నారు. ఇండోస్పిరిట్స్‌లోని ఎల్1 షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగాలు నమోదు చేసింది.