లైగర్​ పెట్టుబడులపై ఛార్మీ, పూరీలను ప్రశ్నించిన ఈడీ

By udayam on November 18th / 4:37 am IST

‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ లను గురువారం ఈడీ 12 గంటలకు పైగా ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు మేరకు ఫెమా నిబంధలనలకు విరుద్దంగా దుబాయ్​ నుంచి ఛార్మీ అకౌంట్​ కు పలుమార్లు పెద్ద మొత్తంలో డబ్బులు రావడాన్ని ఇదివరకే గుర్తించిన ఈడీ అధికారులు దీనిపై ప్రశ్నించేందుకు వీరిద్దరినీ నిన్న కార్యాలయానికి రావాలని సమన్లు ఇచ్చింది. లైగర్ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? నిధుల సమీకరణ, నిర్మాణ ఖర్చులు, వచ్చిన ఆదాయం, పంపకాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని వారికి చెప్పి పంపించారు.

ట్యాగ్స్​