మహారాష్ట్ర చెందిన రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ నివాసంలో ఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ తనఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. 2017లో ఆయన దాపోలీ వద్ద కొన్న ఓ భూమిని 2019లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే 2020లో అదే భూమిని 1.10 కోట్లకు ఆయన వేరే వ్యక్తికి అమ్మేశారు. ఈ క్రమంలో అక్కడ కట్టిన రిసార్ట్‌కు రూ.6 కోట్ల బ్లాక్ మనీని వినియోగించినట్లు ఈడీ పేర్కొంది.