ఈడీ: ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా ఆస్తులు సీజ్​

By udayam on December 7th / 10:16 am IST

ఎన్నారై అకాడమీ సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ లో సోదాలు పూర్తయ్యాయని, ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిపినట్లు తెలిపింది. సొసైటీ సభ్యులు అకాడమీ నిధులతో సొంత భవనాలు నిర్మించుకున్నారని, కరోనా సమయంలో భారీగా అక్రమాలు చేసి ఆర్థికంగా లబ్ధిపొందారని తెలిపింది.

ట్యాగ్స్​