రోహిత్​: ఈడీ విచారణకు మరింత సమయం కావాలి

By udayam on December 19th / 7:14 am IST

బెంగళూరు డ్రగ్స్​ కేసులో బిఆర్ఎస్ నేత, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరుకాలేదు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సేకరించడం పూర్తికాలేదని చెబుతూ..అయ్యప్ప మాలలో ఉన్నందున సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈడీ కి లేఖ రాసిన ఆయన తన పిఎ తో ఆ లేఖను పంపారు. బ్యాంకుకు వరుస సెలవుల నేపథ్యంలో తన ఖాతాకు సంబంధించిన స్టేట్ మెంట్లు తీసుకోలేక పోయానని అందులో పేర్కొన్నారు.

ట్యాగ్స్​