ఫరూఖ్​ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

By udayam on May 27th / 12:26 pm IST

జమ్మూ కశ్మీర్​ మాజీ సిఎం ఫరూఖ్​ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్​ కేసులో విచారణకు గానూ ఈనెల 31న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. జమ్మూ అండ్​ కశ్మీర్​ క్రికెట్​ అసోసియేషన్​లో జరిగిన ఆర్ధిక అవకతవకలపై విచారణకు గానూ ఈ సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసుకు సంబంధించి 2020 ఏడాదిలో ఫరూఖ్ కు చెందిన 11.86 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. 84 ఏళ్ళ ఈ వృద్ధ రాజకీయ నాయకుడిని ఇదే కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారించింది.

ట్యాగ్స్​