జరిమానా కడితేనే షిప్​ను వదులుతాం : ఈజిప్ట్​

By udayam on April 12th / 6:22 am IST

గత నెలలో ప్రఖ్యాత సూయెజ్​ కెనాల్​ను 5 రోజుల పాటు బంద్​ చేసిన భారీ షిప్పింగ్​ నౌక ఎవర్​ గివెన్​పై తాము విధించిన జరిమానా చెల్లిస్తేనే దానిని వదిలిపెడతామని ఈజిప్ట్​ స్పష్టం చేసింది. 1 బిలియన్​ డాలర్ల జరిమానాను ఆ షిప్​ యాజమాన్య కంపెనీ ఎవర్​ గ్రీన్​కు విధిస్తున్నట్లు ఈజిప్ట్​ గతంలోనే తెలిపింది. సూయజ్​ కాలువ ఛైర్​పర్సన్​ ఒసామా రాబీ దీనిపై మాట్లాడుతూ ‘ఇందుకోసం మేం త్వరితగతిన ఓ అగ్రిమెంట్​కు రానున్నాం. వారు మా ఫైన్​ను కట్టేస్తే మేం తక్షణం ఆ భారీ వెస్సెల్​ను వదిలేస్తాం’ అని ఆమె వెల్లడించారు.

ట్యాగ్స్​