ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం 80 ఇళ్ళు మంటల్లో కాలిపోయాయి. యూనివర్శిటీ క్యాంపస్ పరిసరాల్లో కక్కిరిసిపోయిన భవనాల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి బాధితులు ఇళ్ళ నుంచి బయటకు రాలేకపోయారని అధికారులు చెబుతున్నారు. మంటల్ని అదుపు చేయడానికి 25 అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి.