ట్విట్టర్ ఉద్యోగులకు రోజుకో కొత్త రూల్ పెడుతూ.. పనిగంటలు పెంచుతూ బెదిరింపులకు దిగుతున్న బిలియనీర్ ఎలన్ మస్క్.. తన మరో కంపెనీ స్పేస్ ఎక్స్ లోనూ ఛండశాసనుడిలానే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీ నుంచి కూడా ఉద్యోగులు తప్పుకుంటున్నారని రాయిటర్స్ పత్రిక రిపోర్ట్ చేసింది. బాస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినందుకు స్పేస్ ఎక్స్ లో కీలకమైన 8 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారని వెల్లడించింది. సంస్థలో పని వాతావరణం అంతగా బాలేదని వారు యజమానికి లేఖ రాయడమే వాళ్ళు చేసిన ఘోరాతి ఘోరమైన నేరం.