తాతయ్యలూ మరింత టీ తాగండి

85 ఏళ్ళ పైబడ్డ వారు రోజుకు 5 కప్పులు టీ తాగితే మంచిదన్న సర్వే

By udayam on January 12th / 12:55 pm IST

రోజువారీ పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండే పండు ముసలి వారు మరింత ఆరోగ్యంగా ఉండడానికి తేనీరు ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా సర్వేలో బయటపడింది.

2006 నుంచి 2020 వరకూ ది నేషనల్​ పీపుల్​ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 1000 మంది 85 ఏళ్ళకు పైబడిన వారిని పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఎన్ని కప్పులు టీ తాగాలంటే!

రోజుకు కనీసం 5 కప్పులు టీ తాగుతూ రోజు వారీ పనులు చేసుకుంటే వారు నూరేళ్ళు ఎలాంటి బాధలు లేకుండా జీవించగలరని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపారు.

టీ తాగడం వల్ల ఆ వయసులోనూ ఒక విషయంపై సరైన అవగాహన, కష్టమైన పనులు సైతం చేయగలగడం వంటివి చాలా సులభంగా చేయగలుగుతున్నారని తేల్చారు.

టీ తాగే వారిలో జీర్ణక్రియతో మరిన్ని ఆరోగ్యవంతమైన లాభాలు ఉన్నాయని తెలిపారు. ఫ్రెండ్స్ తో కూర్చుని కబుర్లు చెప్పుకునే సమయంలోనూ, ఉదయం లేవగానే, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రుళ్ళు కలిపి మొత్తంగా రోజుకు 5 సార్లు టీ తాగితే మంచి లాభాలు ఉన్నట్లు ఈ సర్వే తెలిపారు.

ఈ సర్వే ఎలా నిర్వహించారంటే!

2006 నుంచి నిర్వహిస్తున్న సర్వే.. ఇళ్ళకు వెళ్ళి పెద్దవారికి సహకరించే నర్సుల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ వచ్చారు. వారి దినచర్య, భోజనం, టీ తాగే అలవాట్లు అన్నింటినీ దాదాపు 15 ఏళ్ళ పాటు క్రోడీకరించి సర్వే ఫలితాల్ని వెల్లడించారు.