ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఎలక్ట్రిక్​ వాహనాలే

స్పష్టం చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ

By udayam on February 20th / 11:10 am IST

ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్​ వాహనాలే తప్పనిసరిగా వాడాలని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ముందుగా తన ఆధ్వర్యంలోని శాఖాధికారులకు ఈ ఎలక్ట్రిక్​ వాహనాల వాడకం తప్పనిసరి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఢిల్లీలో 10 వేల ఎలక్ట్రిక్​ వాహనాలు వాడుతున్నట్లయితే దాదాపు 30 కోట్ల పెట్రోల్​, డీజిల్​ సేవ్​ చేయడంతో పాటు వాయు కాలుష్యాన్ని సైతం అరికట్టవచ్చని ఆయన వెల్లడించారు.

‘‘గో ఎలక్ట్రిక్​ క్యాంపెయిన్​లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎలక్ట్రిక్​ వాహనాల వాడకం తప్పని సరి చేయనున్నాం. ప్రజలు డీజిల్​, పెట్రోల్​ వాహనాల నుంచి ఎలక్ట్రిక్​ మళ్ళేలా చేయడమే మా ప్రాధాన్యం. దాంతో భారత్​కు 8 లక్షల కోట్ల దిగుమతి బిల్లులు మిగులుతాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​
Source: republicworld