గ్రిమ్స్​తో విడిపోయిన ఎలన్​మస్క్​

By udayam on September 25th / 4:48 am IST

ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు, ఇద్దరు గర్ల్​ ఫ్రెండ్స్​ను మార్చిన టెక్​ బిలియనీర్​ ఎలన్​ మస్క్​ మళ్ళీ సింగిల్​ అయ్యాడు. అతడి తాజా ప్రియురాలు, అమెరికన్​ పాప్​ సింగర్​ గ్రిమ్స్​ (అసలు పేరు క్లైర్​ ఎలైస్​ బౌచర్​)తో విడిపోయినట్లు ప్రకటించాడు. వీరిద్దరికీ Æ A-12 అనే 1.5 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. ‘3 ఏళ్ళ పాటు కలిసి ఉన్న మేం ఇప్పుడు సెమీ సెపరేటెడ్​గా ఉంటున్నాం. నా కంపెనీ టెస్లా, స్పేస్​ ఎక్స్​ల కోసం విదేశాలకు తిరగడంతో కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవడమే మా విడాకులకు కారణం’ అని మస్క్​ వెల్లడించాడు.