ట్విట్టర్​ కొనుగోలు ధర తగ్గిస్తున్న మస్క్​?

By udayam on May 17th / 9:50 am IST

ట్విట్టర్లో 229 మిలియన్ల ఫేక్​ ఖాతాలు ఉన్నాయంటూ ఆ సంస్థ కొనుగోలును వాయిదా వేసిన మస్క్​.. ఇప్పుడు కొంటానన్న ధరను తగ్గించడానికి బేరాలాడుతున్నాడు. ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొంటానని డీల్​ కుదుర్చుకున్న మస్క్​.. 20 శాతం కంటే ఎక్కువ స్పామ్​ ఖాతాలున్న కంపెనీకి అంత ధర పెట్టలేనని చెబుతున్నాడు. ట్విట్టర్​ సీఈఓ పరాగ్​ అగర్వాల్​ మాత్రం 5 శాతం కంటే తక్కువే స్పామ్​ ఖాతాలున్నాయని చెబుతున్నాడు. వీరిద్దరి వార్​ మధ్య ట్విట్టర్​ షేర్​ 37.39 డాలర్లకు పడిపోయింది.

ట్యాగ్స్​