మస్క్​: జనాభా పెరుగుదలతో నష్టమేం లేదు

By udayam on May 23rd / 10:33 am IST

భూమి మీద జనాభా పెరిగితే పర్యావరణం దెబ్బతింటుందన్న సిద్ధాంతం పూర్తిగా తప్పంటున్నాడు బిలయనీర్​ ఎలన్​ మస్క్​. అదంతా నాన్​సెన్స్​గా కొట్టిపారేసిన ఆయన జనాభా ఎంత పెరిగినా పర్యావరణానికి వచ్చే నష్టం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చాడు. ఆల్​ ఇన్​ సమ్మిట్​లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘భూమి మీద కనీసం మన సంఖ్యనైనా కాపాడుకుందాం. జపాన్​ పరిస్థితిని చూడండి.. ఏటా జనాభా తగ్గుతోంది. నాగరికతను కాపాడుకోవడానికైనా మనం జనాభాను పెంచుకోవాలి’ అని చెప్పారు.

ట్యాగ్స్​