మస్క్​ ప్రశ్న​: ట్విట్టర్​ సీఈఓగా ఉండనా.. తప్పుకోనా?

By udayam on December 19th / 7:19 am IST

వివాదాస్పద నిర్ణయాలతో ట్విట్టర్​ ను దిగజారుస్తున్న ఆ సంస్థ కొత్త బాస్​ ఎలన్​ మస్క్​..తన ఫాలోవర్లకు ఓ పోల్​ పెట్టాడు. అందులో ‘తాను ట్విట్టర్​ సీఈఓగా ఉండనా? తప్పుకోనా?’ అని ప్రశ్న వేశాడు. సోమవారం ఉదయం నాటికి ఈ పోల్​ లో ఆయనను ట్విట్టర్​ సీఈఓ పదవిని వదిలేయమని 56.5 శాతం మంది ఓటేయగా.. వద్దని 43.5 శాతం మంది ఓటేశారు. ఈ ఓటింగ్​ లో వచ్చిన రిజల్ట్​ కు తాను కట్టుబడి ఉంటానని కూడా మస్క్​ పేర్కొన్నాడు. అతడికి ఈ రిజల్ట్​ ముందే తెలుసని, ఇప్పటికే సీఈఓ మార్పుపై బోర్డ్​ లో చర్చ జరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు.

ట్యాగ్స్​