వచ్చే ఐదేళ్ళలో ట్విట్టర్ ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచుతానని ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఇటీవల ఈ కంపెనీని 44 బిలియన్ డాలర్లు పెట్టి కొన్న అతడు.. ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీగా మారుస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సామాన్యులు తప్ప ప్రభుత్వాలు, బిజినెస్ సంస్థలు ఈ యాప్ను వాడాలంటే స్వల్ప మొత్తం చెల్లించాల్సి ఉంటుందని హింట్ ఇచ్చాడు. 2028 నాటికి ప్రస్తుత 5 బిలియన్ల వార్షియ ఆదాయాన్ని 26.4 బిలియన్లకు చేరుస్తానని పెట్టుబడిదారులతో మస్క్ అన్నాడు.