ట్విట్టర్‌ను రూ.3.36 లక్షల కోట్లకు కొనుగోలు చేయాలని భావించిన తన ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ. 5 శాతం ఫేక్ అకౌంట్లు, స్పామ్ ఖాతాల గురించి ఆ సంస్థ ఎలాంటి సమాచారం లేకపోవడం వల్లే తాను ఈ డీల్‌ను పక్కన పెట్టేశానని పేర్కొన్నాడు. తన 22.9 కోట్ల ఫాలోవర్లలో 5 శాతం ఫేక్ ఖాతాలేనని యుఎస్ అధికారులకు ట్విటర్ ఫైలింగ్ ఇచ్చినట్లు రాయిటర్స్ పత్రిక వార్త రాయడంతోనే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.