డబ్బులెక్కువైపోయి ట్విట్టర్ ను కొన్నాడన్న అపవాదును చెరిపేసుకోవడానికి ఎలన్ మస్క్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్ 2.0 వర్షన్ ను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ నయా ట్విట్టర్లో వాయిస్ కాల్స్, వీడియో ఛాట్, ఎన్ క్రిప్టెడ్ సందేశాలు పంపుకునే ఫీచర్లను తీసుకురాన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో తన ఫ్యూచర్ ప్లాన్స్ ను మస్క్ వెల్లడించాడు. దీంతో పాటు హార్డ్ కోడింగ్ పర్ఫెక్షనిస్టులను ప్రపంచంలో ఏమూల ఉన్నా వెతికి కంపెనీలోకి తీసుకురావాలని, ఉద్యోగుల రిఫరెన్సులను ఓకే చేస్తామని కూడా చెప్పుకొచ్చాడు.