అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ సంస్థ విధించిన జీవితకాల నిషేధాన్ని తాను తొలగిస్తానని ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఇటీవల ఆ సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్.. ఆ సంస్థను యూజర్లు మరింత స్వేచ్ఛతో తమ భావాలను ప్రకటించేలా చూస్తానని చెబుతూ వస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ కార్ సమిట్‌లో మాట్లాడిన ఆయన ట్రంప్ బ్యాన్‌ను విమర్శించారు. ‘అది చాలా తీవ్రమైన, దారుణమైన నిర్ణయం. నేను దానిని రద్దు చేస్తా’ అని ప్రకటించాడు.