అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు టెక్ బిలియనీర్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్. నిన్నటి వరకూ యాపిల్ తమకు ఇచ్చే యాడ్స్ ను ఆపేసిందని ఆ కంపెనీ సీక్రెట్లన్నింటినీ పూస గుచ్చినట్లు ట్వీట్లేసిన అతడు.. ఈరోజు మాత్రం ఆ కంపెనీ, ఆ సంస్థ చీఫ్ టిమ్ కుక్ లు చాలా గొప్పోళ్ళంటూ కీర్తిస్తున్నాడు. మా మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇదంతా జరిగిందన్న మస్క్.. సమస్యను పరిష్కరించుకున్నట్లు పేర్కొన్నాడు. యాపిల్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తీసేస్తామని టిమ్ మమ్మల్ని బెదిరించినట్లు గతంలో మస్క్ ఆరోపించాడు.