75 లక్షల కోట్ల కంపెనీగా స్పేస్​ ఎక్స్​

By udayam on October 9th / 6:54 pm IST

టెక్​ బిలియనీర్​ ఎలన్​ మస్క్​ కలల ప్రాజెక్ట్​ స్పేస్​ ఎక్స్​ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు కంపెనీగా అవతరించింది. దాదాపు 100 బిలియన్​ డాలర్ల సంస్థగా నిలిచింది. అంటే మన రూపాయిల్లో ఈ కంపెనీ మార్కెట్​ విలువ రూ.75 లక్షల కోట్లతో సమానం. ఎన్నో వైఫల్యాలు ఎదురైనా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఎలన్​ మస్క్​ ఈ కంపెనీని తీర్చిదిద్దాడు. చైనాకు చెందిన టిక్​టాక్​ మాతృ సంస్థ బైట్​ డ్యాన్స్​ ఈ లిస్ట్​లో 140 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ట్యాగ్స్​