ఏపీ హైవే లపై దిగిన విమానాలు.. ట్రయల్​ రన్​ సక్సెస్​

By udayam on December 30th / 5:16 am IST

జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీపై నిర్వహించిన ట్రయల్‌రన్‌ విజయవంతమైంది. బాపట్ల జిల్లా కోరిశపాడు మండలం పిచ్చకలగుడిపాడు-రేణంగివరం గ్రామాల వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై 4.1 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ ఎయిర్‌స్ట్రిప్‌ను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్మించింది. నిర్మాణ పనులు ముగింపు దశకు చేరడంతో భారత వాయుసేన అధికారులు నాలుగు ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌తో గురువారం ట్రైల్‌ రన్‌ నిర్వహించారు.

ట్యాగ్స్​