మళ్ళీ వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

By udayam on December 7th / 6:03 am IST

రిజర్వ్​ బ్యాంక్​ మరో దఫా వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటును 35 బేసిస్​ పాయింట్లు పెంచి మొత్తంగా 6.25 శాతానికి చేర్చింది. దీంతో దీనికి అనుగుణంగానే దేశీయ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించనున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకూ దఫ దఫాలుగా మొత్తం 2.25 శాతం మేర ఆర్బీఐ రెపో రేటును పెంచినట్లయింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు సైతం 0.35 శాతం పెరిగి 6.5 శాతానికి చేరాయి.

ట్యాగ్స్​
RBI