పాక్​లో క్రికెట్​ ప్రసారానికి నో చెప్పిన స్టార్​

By udayam on June 9th / 10:44 am IST

ఇంగ్లాండ్​, పాకిస్థాన్​ జట్ల మధ్య జరిగే 3 వన్డేలు, 3 టి–20 మ్యాచులు పాకిస్థాన్​లో ప్రసారం కావడం లేదు. దక్షిణాసియా వ్యాప్తంగా క్రికెట్​ ప్రసార హక్కుల్ని భారత కంపెనీ స్టార్​ కలిగి ఉండడమే ఇందుకు కారణం. 2019 లో భారత్​ జమ్మూ కాశ్మీర్​కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన నేపధ్యంలో భారత కంపెనీలతో ఉన్న అన్ని సంబంధాల్ని పాక్​ వదులుకుంది. దీంతో ఇప్పుడు ఈ మ్యాచుల ప్రసారాలకు ఆ దేశం స్టార్​ను సంప్రదించినప్పటికీ స్టార్​ ఒప్పుకోలేదు. జులై 8 నుంచి ఈ సిరీస్​ జరగనుంది.

ట్యాగ్స్​