కేంద్రం : కొవిడ్​ నిబంధనలు పాటించండి.. లేదా యాత్రను ఆపేయండి

By udayam on December 21st / 10:00 am IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్​ కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర రాజస్థాన్​ లో కొనసాగుతోంది.

ట్యాగ్స్​