పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల కేంద్రంపై రూ.2.2 లక్షల కోట్ల భారం పడుతోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఈ భారీ నష్టాన్ని తామే భరించనున్నామని పేర్కొన్నారు. ‘గతేడాది నవంబర్, ఈ ఏడాది మేలో తగ్గించిన ఎక్సైజ్ సుంకాల వల్ల వచ్చే నష్టాన్ని మేం అంచనా వేస్తున్నాం. దీనిని కేంద్రమే భరిస్తుంది. దేశంలో నాన్ బిజెపి ప్రభుత్వాలు తగ్గిన పన్నుల సౌలభ్యాన్ని ప్రజలకు బదలాయించాలి’ అని ఆమె పేర్కొన్నారు.