తప్పుడు మాటలే కేసీఆర్​ వింటారు : ఈటెల

By udayam on May 4th / 11:08 am IST

ఒకప్పుడు ధర్మాన్ని, ప్రజలను నమ్ముకుని నడిచిన సిఎం కేసీఆర్​ ఇప్పుడు తప్పుడు మాటలు, వారిచే పనికిమాలిన సలహాలతో కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్​ విమర్శించారు. తనను ఇలా అవమానించి, తనపై తప్పుడు ఆరోపణలు మోపే బదులు నన్ను నేరుగా రాజీనామా చేయమని అడిగితే సంతోషంగా ఇచ్చేవాడినని చెప్పారు. తాను సిఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నని తప్పుడు ప్రచారం చేసిన వారంతా ఒకప్పుడు తన సహచరులేనన్న ఆయన కేసీఆర్​ తర్వాత కేటిఆర్​నే సిఎం కావాలని తాను ఇదివరకే ప్రెస్​మీట్లలో అన్నానని వివరించారు.

ట్యాగ్స్​