హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియను బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్లో పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు.
బెయిల్ తిరస్కరిస్తూ, మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో సోమవారం ఆమెను కష్టడీలోకి తీసుకున్నారు.
కిడ్నాప్ కేసు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు. సేకరించిన ఆధారాలను ముందు ఉంచి అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అఖిల ప్రియ విచారణను మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. భర్త భార్గవ్ రామ్ ఎక్కడున్నాడో తెలపాలని ప్రశ్నిస్తున్నారు.
కిడ్నాప్ కోసం ఉపయో గించిన సిమ్ కార్డ్స్, ఫోన్ కాల్స్‌పై ఆరా తీస్తున్నారు. కిడ్నాప్‌లో పాల్గొన్న నిందితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రేపటితో అఖిలప్రియ కస్టడీ విచారణ ముగుస్తుంది.