చందా కొచ్చర్​ పిటిషన్​ ను కొట్టేసిన బాంబే హైకోర్ట్​

By udayam on December 27th / 10:45 am IST

వీడియోకాన్ గ్రూప్ లోను కేసులో అరెస్టు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల పిటిషన్‌ను విచారించేందుకు బాంబే హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. తమ అరెస్టును చాలెంజ్ చేస్తూ కొచ్చర్ దంపతులు పిటిషన్ వేశారు. ఇప్పుడే దాని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, బెయిల్ కోసం రెగ్యులర్ కోర్టును ఆశ్రయించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. కేసు నమోదైన నాలుగేళ్ల తరువాత ఇప్పుడు అరెస్టు చేయడం సెక్షన్ 41-ఎ ప్రకారం న్యాయవిరుద్ధమని కొచ్చర్ దంపతుల న్యాయవాది వాదించారు.

ట్యాగ్స్​