కొత్తపల్లిపై వైకాపా సస్పెన్షన్​

By udayam on June 2nd / 4:53 am IST

పార్టీ నాయకత్వంపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును వైసీపీ సస్పెండ్​ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల జరిగిన నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో సుబ్బారాయుడు.. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజుపై తీవ్ర విమర్శలకు దిగారు. దీంతో పాటు పార్టీ టికెట్​ ఇవ్వకున్నా 2024 ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పడం కూడా ఆయనపై చర్యలకు ప్రధాన కారణం.

ట్యాగ్స్​