ఎమ్మెల్సీ అభ్యర్థిగా పివి కుమార్తె

కేసీఆర్ అనూహ్య నిర్ణయం

By udayam on February 22nd / 2:48 pm IST

హైదరాబాద్‌ : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌  పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా  కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించారు. కాగా  ఖమ్మం-వరంగల్‌-నల్గొండ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఇప్పటికే ఖరారు చేసారు.

ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ స్థానం నుంచి రాములు నాయక్‌ (కాం‍గ్రెస్‌), పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్‌ఎస్‌) ప్రధానంగా పోటీలో ఉండగా.. ఫ్రొపెసర్‌ కోదండరాం, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి (బీజేపీ), విజయసారథి రెడ్డిలు బరిలో ఉన్నారు. ఇక  హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) రామచంద్రారెడ్డి (బీజేపీ), ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ బరిలో  ఉన్నారు.ఇప్పుడు టిఆర్ ఎస్ అభ్యర్థిగా పివి కుమార్తెను ప్రకటించడంతో రసవత్తరంగా మారింది.