వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని అన్నానగర్ లో ఒక హోటల్లో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా నేతల సమావేశంలో ఆయన మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా, లేక ఇతర పార్టీతో పొత్తు ఉంటుందా అనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. బూత్ కమిటీల వారీగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతామన్న ఆయన డిఎంకే తో కలిసి ముందుకు వెళ్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.