ఎఫ్3 జట్టుతో పూజా హెగ్డే ఆడి పాడిన ప్రత్యేక సాంగ్ ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ ప్రోమోను యూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పూజా హెగ్డేకు ఇదే తొలిసారి. వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మలు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఈనెల 27న విడుదల కానుంది.