విద్యార్థులకూ ఫేషియల్​ రికగ్నిషన్​ పద్దతిలోనే హాజరు

By udayam on November 21st / 10:28 am IST

ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్‌ విషయంలో ఎపి సర్కార్​ కీలక మార్పులు చేయనున్నారు. విద్యార్థులకు సైతం ఫేషియల్​ రికగ్నిషన్​ ద్వారా అటెండెన్స్​ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని డిసెంబర్​ మొదటి వారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరులోగా విద్యార్థుల రిజిస్ట్రేషన్​ పూర్తి చేసి.. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచే ఈ ఫేషియల్​ రికగ్నిషన్​ ను మొదలుపెట్టాలని విద్యా శాఖ సైతం కసరత్తును మొదలెట్టింది. డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ వంటి అన్ని కోర్సుల విద్యార్థులకూ ఈ విధానం తప్పనిసరి. వీరితో పాటు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు సైతం షేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారానే హాజరు నమోదు కానుంది.

ట్యాగ్స్​