2 కెమెరాలతో ఫేస్​బుక్​ స్మార్ట్​వాచ్​

By udayam on June 10th / 9:14 am IST

వచ్చే ఏడాదిలో ఫేస్​బుక్​ తన తొలి స్మార్ట్​వాచ్​ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్​వాచ్​లో 2 కెమెరాలు ఉండనున్నాయి. వీటి సాయంతో ఫోటోలు, వీడియోలను 1080 పిక్సెల్​ క్వాలిటీతో తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఆపిల్​ స్మార్ట్​వాచ్​కు మార్కెట్ లో ఉన్న క్రేజ్​కు పోటీగా ఫేస్​బుక్​ సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటి వరకూ ఆక్యులస్​ హెడ్​సెట్​, వీడియోకాలింగ్​ డివైజ్​లు పోర్టల్​, పోర్టల్​ ప్లస్​ గాడ్జెట్​లు మాత్రమే ఫేస్​బుక్​ నుంచి రిలీజ్​ అయ్యాయి.