ఇకపై రాజకీయ ప్రకటనలు వేయం

ప్రకటించిన ఫేస్​బుక్​

By udayam on January 28th / 10:35 am IST

ఇకపై తమ ప్లాట్​ఫామ్​పై పౌర, రాజకీయ పరమైన ప్రకటనల్ని అనుమతించమని సోషల్​ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్​బుక్​ వెల్లడించింది.

ఈ మేరకు ఆ సంస్థ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ మార్క్​ జుకర్​బర్గ్​ ఓ ప్రకటనను విడుదల చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ తాము ఇకపై ఎలాంటి రాజకీయ ప్రకటనలకు అనుమతులు ఇవ్వదలచుకోవట్లేదని పేర్కొన్నారు.

అయితే ఫేస్​బుక్​ గత ఏడాది అక్టోబర్​ నుంచే అమెరికాలో ఇలాంటి రాజకీయ ప్రకటనల్ని ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్స్​ సందర్భంగా నిలిపివేసింది. ఇప్పుడు ఇదే పనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.