రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీలో ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఉండనున్నట్లు పేర్కొంది. సచివాలయం, హెచ్‌వోడీ, జిల్లాస్థాయి ఆఫీసుల్లో జనవరి 1వ తేదీ నుంచి ఈ ఫేషియల్ అటెండెన్స్ అందుబాటులోకి రానుంది. మిగతా అన్ని స్థాయిల ఉద్యోగులకు జనవరి 16వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇదే రూల్ వర్తించనుంది.