రైనా ‘బ్రాహ్మిణ్​’ కామెంట్లపై రగడ

By udayam on July 22nd / 2:32 am IST

తాను కూడా ఓ బ్రాహ్మిణ్​నే అంటూ క్రికెటర్​ సురేష్​ రైనా చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్​ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ప్రీమియర్​ లీగ్​కు కామెంటేటర్​గా పనిచేస్తున్న రైనా ‘చెన్నై సంస్కృతి గురించి నాకు తెలుసు. కాబట్టి నేను కూడా బ్రాహ్మిణ్​నే’ అంటూ ఈ లీగ్​ తొలి మ్యాచ్​ జరుగుతుండగా వ్యాఖ్యానించాడు. ‘2004 నుంచి చెన్నైలో ఆడుతున్నా. ఇక్కడ కల్చర్​ అంటే నాకు ప్రాణం. నా జట్టు సభ్యులు అనిరుధ శ్రీకాంత్​, భద్రి, బాలాజిలంటే నాకెంతో ఇష్టం’ అంటూ రైనా వ్యాఖ్యానించాడు.

ట్యాగ్స్​