కృష్ణ పెద్ద కర్మకు అభిమానులకూ పిలుపు!

By udayam on November 23rd / 11:45 am IST

ఈనెల 27న జరగనున్న సూపర్​ స్టార్​ కృష్ణ పెద్ద కర్మకు ఘట్టమనేని అభిమానులను సైతం పిలవాలని మహేష్​ బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి మహేష్​ తో పాటు, అతని చిన్నాన్న ఆదిశేషగిరిరావు సైతం రానున్నారు. కృష్ణ అంత్యక్రియలు రోజు, చాలామంది అభిమానులు ఎక్కడెక్కడ ఊర్ల నుండో వచ్చి అతన్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో పద్మాలయ స్టూడియోస్ కి వచ్చారు. కానీ చాలామంది చూడలేకపోయారు. అందుకని పెద్ద కర్మ రోజున అభిమానులను కూడా ఆహ్వానించాలని మహేష్ భావిస్తున్నాడట. దీనికి సంబదించిన ప్రకటన రానుంది.

ట్యాగ్స్​