రైతుల హత్యలను ఖండిస్తున్నా: నిర్మల

By udayam on October 13th / 11:38 am IST

ఉత్తర ప్రదేశ్​లోని లఖింపూర్​ ఖేరీ రైతుల హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్​ కెనెడీ స్కూల్​లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లోని బిజెపి ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టే మీడియా పెద్దదిగా చూస్తోందని మాట్లాడారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా కూడా జరిగాయన్న ఆమె అప్పుడు ఇవి పతాక శీర్షికలకు ఎక్కలేదన్నారు.

ట్యాగ్స్​