ఏడాది క్రితం తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదంటూ మరోసారి ఉద్యమబాట పట్టనున్నాయి రైతు సంఘాలు. సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదంటూ ఈనెల 26న దేశవ్యాప్తంగా రాజ్ భవన్ ల మార్చ్ లు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటిచింది. సాగు చట్టాలను రద్దు చేసి ఏడాది కావస్తుండడంతో ఈనెల నవంబర్ 19ని ‘ఫతే దివాస్’గా జరుపుకోనున్నట్టు తెలిపింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీని కేంద్రం పరిగణనలోకి తీసుకొనేందుకు సిద్ధంగా లేదని ఆరోపించారు కిసాన్ మోర్చా నేతలు.