ఛత్తీస్‌గడ్‌: స్కూటీని ఢీకొట్టి.. ఈడ్చుకెళ్ళిన కారు.. ఇద్దరు మృతి

By udayam on January 9th / 6:02 am IST

ఢిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువకముందే … ఛత్తీస్‌గడ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలోని పుల్గావ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే జ్ఞాన్‌చంద్‌ లేఖ్వాని (56), వందన (45) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జ్ఞాన్‌చంద్‌ తన భార్యతో కలిసి ఓ సంగీత కచేరీకి హాజరై అర్ధరాత్రి స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి స్కూటీని బలంగా ఢీకొట్టింది. దంపతులిద్దరినీ ఈడ్చుకొంటూ 300 మీటర్ల వరకు వెళ్లి.. ఓ వంతెన రక్షణగోడను బలంగా తాకింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జ్ఞాన్‌చంద్‌ దంపతులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

ట్యాగ్స్​