12 మంది భార్యలు, 102 మంది పిల్లలు పుట్టాక గానీ తెలియలేదా స్వామీ!!

By udayam on December 28th / 8:55 am IST

ఉగాండాకు చెందిన ఓ వ్యక్తి ఇకపై తన కుటుంబాన్ని పెద్దది చేయాలనుకోవడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్​ గా మారాయి. ఇందులో వైరల్​ కావడానికి ఏముంది? అనుకుంటే మీకు ఇతడి ‘పేద్ద’ ఫ్యామిలీ కోసం తెలియనట్టే.. ఇతడికి మొత్తం 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. వారికి 568 మంది సంతానం మరి! ఇప్పుడు చెప్పండి.. ఎంత లేట్​ గా రియలైజ్​ అయ్యాడో ఈ ఘనుడు. మూసా హసహ్య (67) అనే ఈ వ్యక్తికి అతి పిన్న వయసున్న కొడుకు (21) కంటే చిన్న వయసున్న భార్య ఉండడం విశేషం. ఇకపై తాను మరో పెళ్ళి చేసుకోనని, తన కుటుంబాన్ని పెంచనని, వీరిని పోషించడం తన వల్ల కావడం లేదని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​