పాకిస్థాన్ బాహుబలిగా పేరు తెచ్చుకున్న మూవీ ఏ దిల్ హై ముష్కిల్ భారత్ లో రిలీజ్ చేయాలన్న ఆలోచనలకు భారత సర్కార్ మోకాలడ్డింది. పలు బాలీవుడ్ మూవీస్ లో నటించిన పాక్ నటుడు ఫవద్ ఖాన్ లీడ్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. డిసెంబర్ 30 ఈ మూవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ ను సెన్సార్ బోర్డ్ అడ్డుకుంది. పంజాబ్ లో కొన్నిచోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు వేయగా అక్కడ గొడవలు జరిగాయని పేర్కొంది. 2011లో పాక్ కు చెందిన ఉర్దూ సినిమా బోల్ తర్వాత ఇప్పటివరకూ పాకిస్థాన్ సినిమా ఒక్కటీ భారత్ లో విడుదల కాలేదు.