షియామీకి షాక్​.. రూ.5,551 కోట్లు జప్తు చేసిన ఈడీ

By udayam on October 1st / 5:18 am IST

చైనా టాప్​ స్మార్ట్​ఫోన్​ కంపెనీ షావోమీకి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ భారీ షాక్​ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది. ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కేసులో ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంస్థ కార్యాలయాలపై పలుమార్లు సోదాలు జరిపిన ఈడీ పలు కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో నగదును జప్తు చేయడం ఈడీ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతే మొత్తాన్ని షియామీ సంస్థ విదేశాలకు తరలించిందన్న కారణంతో ఈ జప్తును చేపట్టింది ఈడీ.

ట్యాగ్స్​